డిక్టేట‌ర్‌తో బాల‌య్య పుల్‌స్టాప్ పెట్టేస్తాడా?❓❓

  |   Tollywood

నంద‌మూరి బాల‌కృష్ణ 99వ చిత్రం.. డిక్టేట‌ర్ ఈ సంక్రాంతికి వ‌స్తోంది. ఆ సంద‌డి క‌న్నా... త్వ‌ర‌లోనే బాల‌య్య సెంచ‌రీ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న ఆనందమే అభిమానులలో ఎక్కువుగా క‌నిపిస్తోంది😂.సెంటిమెంట్ ప‌రంగా 99వ సినిమాతో ఆపేస్తే... బాగోదు. అందుకే మోక్ష‌జ్ఞ తొలి సినిమాలో అతిథి పాత్ర వేసి.. వంద సినిమాల మైలు రాయిని అందుకొంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది👍. మ‌రోవైపు బాల‌య్య వ‌య‌సు కూడా పైబ‌డుతోంది😶. డిక్టేట‌ర్ ప్ర‌చార చిత్రాల్లో చాలా బొద్దుగా క‌నిపిస్తున్నాడు బాల‌కృష్ణ‌😏. పెరుగుతున్న త‌న వ‌య‌సుని దృష్టిలో ఉంచుకొని బాల‌య్య ఈ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు చెప్పుకొంటున్నారు☝. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మ‌రింత క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించడ‌మే.. ముఖ్య‌మ‌ని బాల‌కృష్ణ భావిస్తున్నార‌న్న వార్త సినీ అభిమానుల్ని విస్మ‌య ప‌రుస్తోంది😱.