మహేష్ ని ఫాలో ఫాలో అంటున్న ఎన్టీఆర్❗❗

  |   Tollywood

ఈ సంక్రాంతికి ఎలాగైనా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాలనే కసితో వున్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్😏. వరుస ఫ్లాప్ ల నుంచి 'టెంపర్' తో కోలుకున్న ఈ చిన్నోడు..నాన్నకు ప్రేమతో సినిమాపై మంచి ధీమాగా వున్నాడు👍.రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే దారిలో వెళ్ళి భారీ విజయాన్ని సాధించాడు👍. ఎప్పుడూ మీడియాకి కొంచెం దూరంగానే వుండే మహేష్ బాబు నేనొక్కడినే, ఆగడు ఫ్లాప్ ల తరువాత తన స్ట్రాటజీ మార్చుకున్నాడు👆. శ్రీమంతుడు రిలీజ్ కి ఒక నెల ముందే నుంచే మీడియాతో స్నేహంగా వుండడం మొదలుపెట్టాడు👋. మీడియా మిత్రులందరికీ అందుబాటులోకి వచ్చాడు👍. ఫలితంగా శ్రీమంతుడుతో మంచి విజయాన్ని అందుకున్నాడు✨.ఇప్పుడు ఇదే దారిని యంగ్ టైగర్ ఎంచుకున్నాడు☝. ఈ రోజు మీడియా మిత్రులతో దస్ పల్లా హౌటల్‌లో సమావేశం కాబోతున్నాడు🙌. మరి మహేష్ ని ఫాలో ఫాలో అంటున్న ఎన్టీఆర్ కి హిట్ దక్కుతుందా? అనేది వేచి చూడాల్సిందే😍.