జూనియర్కి వీరాభిమానిని : కుష్బూ❗❗

  |   Tollywood

సాధారణంగా యంగ్ జనరేషన్ హీరోయిన్లు, సీనియర్ హీరోలకు అభిమానులుగా ఉంటారు✨. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అయ్యింది😸. టాలీవుడ్ యంగ్ జనరేషన్లో టాప్ హీరోగా ఉన్న జూనియర్కు, ఓ సీనియర్ హీరోయిన్ 'వీరాభిమానిని', అని తానే స్వయంగా చెప్పటంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు😂.కొద్ది రోజులుగా వివిధ సందర్భాల్లో నాన్నకు ప్రేమతో సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు సీనియర్ నటి కుష్బూ😬. అయితే అభిమానులు ఈ సినిమా మీద ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు❓. దీంతో తన అభిమానులకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది కుష్బూ👍. 'ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి నన్ను అడిగే వారికి చెపుతున్నాను☝. నేను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానిని, ఏవో కొన్ని తప్ప అతని సినిమాలన్నీ చూస్తాను'😙. అంటూ ట్వీట్ చేశారు👏. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్, కుష్బూలు కలిసి నటించారు👫.