దక్షిణాదిలో తొలిసారిగా జాంబీ మూవీ!😱

  |   Tollywood

ఇండియన్ స్క్రీన్ మీద డ్రాక్యులా, ప్రిడేటర్, జాంబీ తరహా సినిమాలు చాలా అరుదు, అలాంటి అరుదైన జానర్‌లో త్వరలో ఓ సినిమా రాబోతోంది😱. అది కూడా మన సౌత్ ఇండస్ట్రీలో కావటం మరో విశేషం👍. ఇటీవల తనీఒరువన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయం రవి మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు👏.జయం రవి , లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో శక్తి సౌందర్ రాజన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు👋. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ హీరోగా తెరకెక్కిన ఐయామ్ లెజెండ్ తరహాలో కనిపిస్తున్న ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి😙.