బాహుబలికి మరో గౌరవం👏👏

  |   Tollywood

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి👍. ఈ సినిమా విడుదలై 7 నెలలవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో బాహుబలి పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది😆. ఇప్పటికే కలెక్షన్లతో పాటు అవార్డుల విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న బాహుబలి ఇప్పుడు మరో ఘనత సాధించింది👏.2015 గిల్డ్ అవార్డ్స్ లిస్ట్లో స్థానం సంపాదించి మరోసారి వార్తల్లో నిలిచింది బాహుబలి☝. ఎవరు ఊహించని స్థాయి భారీచిత్రాన్ని రూపొందించినందుకు గాను ఈ ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది గిల్డ్ అవార్డ్స్ జ్యూరీ🏆. ఈ సందర్భంగా అవార్డ్ ప్రధానం చేసిన ముఖేష్ భట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు👍. 'ఎవరు చేయలేని ఓ సాహసం చేసిన నిర్మాత, దర్శకుడు, చిత్రయూనిట్ గురించి మాట్లడటం ఎంతో గర్వంగా ఉంది😂. రాజమౌళీ.. నువ్వు మరిన్ని చిత్రాలతో మేము గర్వించేలా చేయాలి' అన్నారు👌.