విజయవాడలో బ్రహ్మోత్సవం❓

  |   Tollywood

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఊటీలో షూటింగ్ పూర్తిచేసుకుంది👍. ఈ వారంనుండి విజయవాడలో మరో షెడ్యూల్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు☝. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు అందాల భామలు సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు😍. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయవాడ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది👌. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు🙌. విజయవాడలో జరిగే షూటింగ్ వారం పాటు కొనసాగుతుందని, పి.వి.పి, మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కే ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది👏.