సరైన సమయంలో సరైన నిర్ణయం❗❗

  |   Tollywood

కెరీర్‌కు గుడ్‌బై చెప్పే విషయంలో తాను సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు☝. ప్రస్తుతం ఆసీస్ పర్యటనే తనకు ప్రధానమని అతను చెప్పాడు👍. వరల్డ్ కప్ తర్వాత భారత్ రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోవడం👎, ధోని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడంతో పాటు కోహ్లిని అన్ని ఫార్మాట్‌లలో కెప్టెన్‌ను చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు☝. ‘నేను వర్తమానంలో మాత్రమే బ్రతికే మనిషిని👍. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియా సిరీస్ గురించి, ఆ తర్వాత జరిగే టి20 ప్రపంచ కప్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా👆. రిటైర్మెంట్ గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా’ అని ధోని పేర్కొన్నాడు🙌.