'అప్పుడే కెప్టెన్ అయ్యేవాడిని' వీరేంద్ర సెహ్వాగ్❗❗

  |   క్రికెట్

ద్రవిడ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సమయంలో తాను జట్టులో సభ్యుడిని కాదని, లేదంటే అప్పుడే తాను టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యేవాడినని వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు☺. కనీసం రెండేళ్లు తాను కొనసాగేవాడినని అతను గుర్తు చేసుకున్నాడు☝. భవిష్యత్తులో కోచ్, మెంటార్ లేదా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు వీరూ చెప్పాడు👍. తాను ఇప్పటికే చాలా డబ్బు సంపాదించానని, ఇకపై కూడా సంపాదించగలను కాబట్టి ఐపీఎల్‌లో మరో ఆటగాడి అవకాశం దెబ్బ తీయరాదనే తప్పుకున్నట్లు అతను చెప్పాడు👆. ధోనితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశాడు🙌.