అలా ట్రైన్ లో నా 'ఫస్ట్‌నైట్' : చిరంజీవి❗❗

  |   Tollywood

'డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం'. 2015 సంవత్సరంకు గాను దర్శకేంద్రుడు డాక్టర్ కే రాఘవేంద్రరావుకి అవార్డును ప్రదానం చేశారు🏆. ఈ ప్రదానోత్సవం కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది✨. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నాకు 'ఫస్ట్‌నైట్' అరేంజ్ చేసింది మాత్రం రాఘవేంద్రరావు గారని చెప్పారు☝. రాఘవేంద్రరావు సినిమా అంటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పూలు, పళ్లు, స్వీట్లే🙌.'పెళ్లయిన కొత్తలో ఒకసారి సినిమా షూటింగ్ నిమిత్తం నేను, సురేఖ రైలులో మద్రాసుకు వెళ్తున్నాం👫. మేము రైలులో వెళ్తున్నా సంగతి తెలుసుకున్న డైరక్టర్ గారైన రాఘవేరారావు గారు మాకోసం రైలు బోగీలో పూలు, పళ్లు, స్వీట్లతో అచ్చం ఆయన సినిమాలోని ఫస్ట్‌నైట్ సీన్‌ను తలపించేలా డెకరేట్ చేయించారు😂. ఇదంతా ఆయన ఒక్క ఫోన్ కాల్‌తో చేయించారు. ఇలాంటి ఫస్ట్‌నైట్ నేను నిజంగా ఎప్పుడూ చేసుకోలేదు☝. ఆ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను''. అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు👍.