ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన❗❗

  |   క్రికెట్

ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగడంతో ముస్తాక్ అలీ టి20 టోర్నీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో బరోడా 72 పరుగుల తేడాతో గోవాను చిత్తు చేసింది👍. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది👏. ఇర్ఫాన్ పఠాన్ (29 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుకు తోడు కేదార్ దేవధర్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు👍. అనంతరం గోవా 15.4 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది👎. దీప్‌రాజ్ గావ్‌కర్ (42 బంతుల్లో 48; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు☝. రిషి అరోథే, హార్దిక్ పాండ్యా, ఇర్ఫాన్ పఠాన్ తలా 2 వికెట్లు తీశారు👆.