కాజల్ నోట..ఓ పాట❓

  |   Tollywood

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి జోరుమీదున్న కాజల్ ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తోంది👍. మరోవైపు తమిళంలో విక్రమ్, సూర్య వంటి హీరోల సరసన నటిస్తున్న ఈ భామ కన్నడలో కూడా ఎంట్రీ ఇస్తోంది👌. ఇప్పటికే సినిమాల్లోని పలు పాటల్ని హీరోలు పాడుతున్న విషయం తెలిసిందే☝. తాజాగా కన్నడంలో రూపొందుతున్న ‘చక్రవ్యూహ్’ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాట పాడారు👆. తన ఫ్రెండ్ పునీత్‌రాజ్‌కుమార్ కోసం ఈ పాట పాడినట్టు ఆయన తెలిపాడు☝. ఇదే సినిమాలో గ్లామర్ భామ కాజల్ కూడా ఓ పాట పాడటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది👍.