చైనా దెబ్బ: కుదేలైన భారత మార్కెట్లు😱😱

  |   Tollywood

చైనా మార్కెట్ల ప్రభావం భారత మార్కెట్ల పై మరోసారి పడింది😢. చైనాలో షేర్లు ఒక్కరోజే 7శాతం నష్టపోవడంతో అక్కడ ట్రేడింగ్ను గురువారం మొత్తం సస్పెండ్ చేశారు👎. అనంతరం భారత్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతోనే మొదలయ్యాయి👎. ఉదయం 9.50 గంటల ప్రాంతానికి సెన్సెక్స్ 332.74 పాయింట్లు నష్టపోయి 25073.59 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 106.15 పాయింట్లు నష్టపోయి 7634.85 వద్ద ట్రేడవుతోంది😭. చైనా ప్రభావం భారత మార్కెట్ల పైనే కాకుండా ఆసియా మార్కెట్లన్నింటిపై పడింది👎. జపాన్ మార్కెట్( నిక్కీ) 334 పాయింట్లు, హాంకాంగ్ మార్కెట్ (హాంగ్ సెంగ్) 501, సింగపూర్ మార్కెట్(స్ట్రేయిట్ టైమ్స్)57 పాయింట్ల నష్టాల్లో ట్రేవడవుతున్నాయి👎.