'థౌజండ్ వాలా'కు ప్రోత్సాహం - ప్రణవ్ ధనావ్‌డే❗❗

  |   క్రికెట్

'థౌజండ్ వాలా' ప్రణవ్ ధనావ్‌డేను ప్రోత్సహించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ముందుకు వచ్చింది👍. అతడికి నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్టు ఎంసీఏ ప్రకటించింది💸. 2016 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు స్కాలర్‌ షిప్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది👏. అంతేకాకుండా అతడి ఆట, విద్యకు సంబంధించిన అంశాలను ఎంసీఏ పర్యవేక్షించనుంది👍. కాగా, ముంబై అండర్-19 జట్టులో స్థానమే తన తదుపరి లక్ష్యమని ప్రణవ్ ధనావ్‌డే తెలిపాడు☝.15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో 129 ఫోర్లు, 59 సిక్సర్లు 1009 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు✨. ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో అతడీ ఘనత సాధించాడు👏.