నోరు పారేసుకున్న క్రికెటర్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది💢❗

  |   క్రికెట్

బుధవారం లాహోర్ లోని గడాఫీ నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అఫ్రిది.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక ఆగ్రహంతో ఊగిపోయాడు😡. అతణ్ని దూషిస్తూ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు🏃. అక్కడ అసలేం జరిగిందంటే..మార్చిలో భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే పాక్ జట్టుకు అఫ్రిదియే సారధి☝. అయితే టీ20 కెప్టెన్ గా మిగతా అందరికంటే అఫ్రిదీకి చెత్త రికార్డుంది👎. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'మీ ఆట, జట్టు తీరును ఎలా మెరుగుపర్చుకుంటారు?' అని ఓ విలేకరి ప్రశ్నించాడు❓. దీనికి బదులుగా 'నువ్వింత ఏడుపుగొట్టు, చచ్చు ప్రశ్న అగుడుతావని నాకు ముందే తెలుసు' అనేసి కోపంగా వెళ్లిపోయాడు అఫ్రిది💢. క్రికెటర్ చర్యతో విస్తుపోయిన విలేకరులు.. క్షమాపణ చెప్పాల్సిందిగా డ్రస్సింగ్ రూమ్ ఎదుట ఆందోళన నిర్వహించారు😱. అయితే పీసీబీ చైర్మన్ షహర్యాన్ ఖాన్ దీనినొక చిన్న సంఘటనగా కొట్టిపారేశారు😉.