ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు✨

  |   Tollywood

హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంకచోప్రా మరో అరుదైన ఘనత సాధించింది👍. ఇప్పటికే ఈ టీవీ సిరీస్ అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ షోగా రికార్డ్ సృష్టిస్తుండగా, అందులో లీడ్ రోల్లో నటించిన ప్రియాంక నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు👏. ఈ నేపథ్యంలో క్వాంటికో టీవీ సిరీస్తో మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియాంక👌. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ 2016కు ప్రియాంక చోప్రా ఎంపికైంది👍.