ప్రిన్స్ గా నంద‌మూరి మోక్ష‌జ్ఞ! బాలయ్య వారసుడి ఎంట్రీ..?❓

  |   Tollywood

టాలీవుడ్లో స్టార్ వారసుల ఎంట్రీకి యమా క్రేజ్ ఉంటుంది💓. ముఖ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుంటుంబాల నుంచి వచ్చే స్టార్ వారసుల రాక కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు😍. అలా ఇండస్ట్రీ వర్గాల చాలారోజులుగా ఎదురుచూస్తున్న స్టార్ వారసుడు నందమూరి మోక్షజ్ఞ👍. బాలకృష్ణ నట వారసుడిగా ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ తెరగేంట్రంపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి👂.ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తన 99వ సినిమా డిక్టేటర్ను పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ, తన 100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు☝. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక సన్నివేశంలో ఓ యువరాజు పాత్ర కనిపిస్తుందట👦. ఆ పాత్రను బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస్👍.గ‌తంలో సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కత్వంలో బాల‌య్య ఆదిత్య 369 సినిమా చేసిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 చిత్రాన్ని చేయాల‌ని సింగీతం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు😍.