ఆమీర్ ప్లేస్ లో అమితాబ్ బచ్చన్!❗❗

  |   Tollywood

ఇప్పటివరకూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్ రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే😟. దీనిపై పెద్ద దుమారమే రేగింది💥. ఆమీర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు😩. ఈ నేపథ్యంలో అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించిన విషయం తెలిసిందే👎. దీంతో ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది👍.మరోవైపు ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందించాడు☝. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అతడు పేర్కొన్నాడు☝.