గేల్ ప్రవర్తన ఊహించిందే: వాట్సన్❗❗

  |   క్రికెట్

విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ అనుచిత ప్రవర్తన ఊహించిందేనని ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ తెలిపాడు😬. బిగ్ బాష్ లీగ్‌లో మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా మాట్లాడిన గేల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే👍. ‘గేల్ గురించి తెలిసిన వారికెవరికైనా ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించదు😛. ఎందుకంటే వారందరికీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు☝.గేల్ ఆటను చూసేందుకు చాలా మంది స్టేడియాలకు వచ్చే మాట వాస్తవం👌. అయితే క్రికెట్‌కు అవతల కూడా ఓ ప్రపంచం ఉంటుందనే విషయం అతడు తెలుసుకోవాలి👆. క్రీజులో ఎంత బాగా ఆడామన్నదే కాకుండా బయట ఎలా ఉంటున్నామన్నది కూడా ముఖ్యం👍. అభిమానులు క్రికెట్‌లో వినోదంతో పాటు మైదానం ఆవల సరైన ప్రవర్తననే గౌరవిస్తారు’ అని వాట్సన్ స్పష్టం చేశాడు👏.