జూనియర్ vs బాలయ్య.. ఎందుకీ ఫైట్!❗

  |   Tollywood

సంక్రాంతి ముంచుకొస్తోంది😂. నందమూరి అభిమానుల్లో కలకలం రేగుతోంది😱. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్‌, డిక్టేటర్‌ సినిమాతో బాలయ్య వస్తున్నారు😟. సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమా కోళ్లే. కాకపోతే.. తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొడుతున్నారా? లేకపోతే ఎవరి సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారా? ఇద్దరి అభిమానుల్లో ఒకటే సంఘర్షణ☝. బాలయ్య అభిమానులు జూనియర్‌కు విజ్ఞప్తులు చేస్తుంటే, జూనియర్‌ అభిమానులు బాలయ్యకు లేఖలు రాస్తున్నారు😶. నెట్లో.. వీళ్ల హడావిడి అంతా ఇంతా కాదు😟. సంక్రాంతి సమయంలో రెండు సినిమాలు విడుదల చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరి మద్దతు ఎవరికి అన్నదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది😦.