ఢీ అంటే ఢీ! పోరుకు సిద్ధమన్న రోహిత్ శర్మ👍👍

  |   క్రికెట్

భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడైనా హోరాహోరీ తప్పదని... ఈసారి కూడా అదే విధంగా సిరీస్ కొనసాగే అవకాశం ఉందని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు👊. గతేడాదిలో ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో తాము గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని అతను గుర్తు చేశాడు✊. ‘ఆస్ట్రేలియా జట్టు అంత సులువుగా ప్రత్యర్థి ముందు తలవంచదు☝. వారిపై బాగా ఆడి గెలవడం ఒక పరీక్షలాంటిదే👆. ప్రతీ పరుగు కోసం పోరాడాల్సి ఉంటుంది💦. అయితే ఇలాంటి సవాళ్లను నేను ఇష్టపడతాను💦. ఇక్కడ రాణిస్తే వచ్చే గుర్తింపు వేరు😀. నేను కూడా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను’ అని రోహిత్ చెప్పాడు👍. వన్డే సిరీస్‌కు వారం రోజులు ముందు రావడం వల్ల ఇక్కడ పరిస్థితులపై తమకు అంచనా ఏర్పడుతుందని, ముఖ్యంగా తొలి వన్డే జరిగే పెర్త్ పిచ్‌పై తమకు పూర్తి అవగాహన ఉందని అతను చెప్పాడు👋.