బుల్లితెరపై పవర్స్టార్..?❓

  |   Tollywood

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడా..❓? పెద్దగా పబ్లిక్ ఫంక్షన్లకు హాజరుకాని పవన్, ఓ టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడా.❓.? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు😌. పవన్ త్వరలోనే ఓ టీవీ షోకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది😅.అమీర్ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సత్యమేవ జయతే జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించింది👍. హిందీలో తెరకెక్కిన ఈ షోను తరువాత పలు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేశారు🙌. ఇప్పుడు ఇదే తరహా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడానికి పవన్ అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది👍. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసే పనుల్లో ఉంది👏.