శిఖర్ ధవన్ - విరాట్ కోహ్లిల దూకుడు:భారత్ బోణీ✨

  |   క్రికెట్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన తొలి వార్మప్ ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా బోణీ కొట్టింది👏. శుక్రవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ 20లో టీమిండియా 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది👍. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుని నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి192 పరుగులు చేసింది✌. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(6) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా.. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ - విరాట్ కోహ్లిలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు👍. శిఖర్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేయగా, కోహ్లి 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు👏.అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసి పరాజయం చెందింది👎. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ ట్రావిస్ బిర్ట్(74 నాటౌట్;60 బంతుల్లో 11 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు👇.ఇరు జట్ల మధ్య రెండో వార్మప్ ట్వంటీ 20 శనివారం ఇదే స్టేడియంలో జరుగనుంది😍.