49లోకి అడుగుపెట్టిన 'మొజార్ట్ ఆఫ్ మద్రాస్'❗

  |   Tollywood

ఇండియా నుంచి ఆల్ టైం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న ఎ.ఆర్ రెహమాన్ ఈ రోజు తన 49వ పుట్టిన రోజు వేడుకని జరుపుకోనున్నాడు🎂. మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై తన మ్యూజిక్ తో అందరి ప్రశంశలు అందుకున్నాడు👏. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో డిప్లమా చేసిన రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడమే కాకుండా అద్భుతంగా పాటలు పాడగలడు👍. ఒకవైపు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు సూపర్ హిట్ ఆల్బమ్స్ ని, మ్యూజిక్ వీడియోలను రూపొందించి మెప్పించాడు👏.