ఎన్టీఆర్‌పై మరో కుట్ర మొద‌లైందా??😱😱

  |   Tollywood

ఎన్టీఆర్ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ పార్టీ మారుతున్నాడంటూ.. వైకాపా తీర్థం పుచ్చుకొంటున్నాడంటూ ఓ వ‌ర్గం రుమ‌ర్లు పుట్టించింది💥. అంటే.. ప‌రోక్షంగా ఎన్టీఆర్ కూడా వైకాపా గూటికి చేరుతున్న‌ట్టే క‌దా?? దాంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం షాక‌య్యారు😳. చివ‌రికి... అదేం లేద‌న్న విష‌యం రూఢీ అయ్యింది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇలాంటి గాసిప్పులే పుట్టాయి☝. వాటన్నింటికీ ఎన్టీఆర్ ఆనాడే స‌మాధానం చెప్పాడు👆. త‌న చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీ కార్య‌కర్త‌గానే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు👍. అయినా స‌రే.. ఇలాంటి గాసిప్పులు పుడుతూనే ఉన్నాయి🙅. అర్థం ప‌ర్థం లేని ప్ర‌చారంతో ఎన్టీఆర్ అభిమానుల్ని గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నార‌ని.. అలాంటి వాళ్లెవ‌రో క‌నిపెట్టి వాళ్ల‌కు బుద్ది చెబుతామ‌ని ఎన్టీఆర్ కాంపౌండ్ వాళ్లు అంటున్నారు👍. మొత్తానికి పొలిటిక్ కుట్ర నుంచి ఎన్టీఆర్ త్వ‌ర‌గానే బ‌య‌ట‌ప‌డ్డాడు👌. మున్ముందు ఇంకెన్ని చూడాల్సివ‌స్తుందో👀.