క్లీన్‌స్వీప్‌తో ‘టాప్’✨✨

  |   క్రికెట్

స్ట్రేలియా పర్యటనకు అద్భుతమైన ముగింపు... తమ బ్యాటింగ్ బలం చూపిస్తూ చివరి టి20లోనూ టీమిండియా చెలరేగింది👍. భారీ లక్ష్యం ముందున్నా... ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగినా... చివరకు ధోనిసేనదే పైచేయి అయింది👏. ఫలితమే 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్. నాలుగు వన్డేల్లో ఓడినా, చివరకు ఐదో వన్డేలో గెలుపుతో స్వాంతన పొందిన భారత జట్టు టి20ల్లో ఆస్ట్రేలియాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బతీసి గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది👍.