టీమిండియా ఎట్ టాప్✨

  |   క్రికెట్

అంతర్జాతీయ ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ కు చేరుకుంది👍. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ధోని సేన ఎనిమిదో స్థానం నుంచి ఒక్కసారిగా పైకి ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది✌. టీమిండియా 120 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ఆస్ట్రేలియా 110 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది👎. ఇదిలా ఉండగా విండీస్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాల్గో స్థానంలో కొనసాగుతున్నాయి☝. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి☝. ఆస్ట్రేలియా తరువాతి స్థానాల్లో ఆప్ఘానిస్తాన్, స్కాట్లాండ్లు ఉన్నాయి☝.