న్యూజిలాండ్‌దే సిరీస్👍👍

  |   క్రికెట్

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విలియమ్సన్ (86 బంతుల్లో 84; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), గప్టిల్ (81 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సమయోచితంగా ఆడటంతో... ఆదివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) పాకిస్తాన్‌పై విజయం సాధించింది👍. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది👌. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది👎. టాస్ గెలిచిన పాక్ 47.3 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది☝. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 265 పరుగుల లక్ష్యాన్ని 42.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది👍.