బ్ర‌హ్మీ.. ఇప్పుడు మేల్కొన్నాడా?😆😆

  |   Tollywood

వేయి చిత్రాల రారాజు బ్ర‌హ్మానందం👨. హీరో ఎవ‌రైనా స‌రే.. బ్ర‌హ్మానందం ఉండాల్సింది👍.అయితే గ‌త కొంత కాలంగా బ్ర‌హ్మానందం క్రేజ్ మ‌స‌క‌బారుతూ వ‌స్తోంది . ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కు పెడుతున్నారు☝. పారితోషికం పెంచేశాడ‌ని, నిర్మాత‌ల్ని ఇబ్బంది పెడుతున్నార‌ని గోల చేశారు💰. తోటి క‌మెడియ‌న్ల‌ని తొక్కేస్తున్నాడ‌ని, కొంత‌మంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కావాల‌నే బ్ర‌హ్మానందాన్ని త‌ప్పిస్తున్నారన్న గుస‌గుస‌లు వినిపించాయి👂. దాంతో బ్ర‌హ్మానందం అలెర్ట్ అయ్యాడు☝. పారితోషికం త‌న‌కు ముఖ్యం కాద‌ని, తోటి హాస్య‌న‌టుల్ని తానెంతో ప్రోత్స‌హించాన‌ని.. చెప్పుకొచ్చాడు👍. సినిమాలు త‌గ్గ‌లేద‌ని, తానే త‌గ్గించుకొన్నాన‌న్న సంకేతాలు పంపాడు☝.నిజంగానే బ్ర‌హ్మానందం ఆలోచ‌న దృక్ప‌థం మారుతూ వ‌స్తోంది👆.. మంచి పాత్ర‌లిస్తేనే చేస్తా - హాస్యం పేరుతో నాతో వెకిలి వేషాలు వేయించొద్దు.. అంటున్నాడ‌ట‌👍.రిటైర్‌మెంట్ తీసుకోక‌పోయినా.. మంచి పాత్ర‌ల‌తోనే మెప్పిస్తా అంటున్నాడు☝. పోనీలెండి.. బ్ర‌హ్మనందం ఇప్ప‌టికైనా మేల్కొన్నాడు👆. కొత్త‌వారికి దారిస్తున్నాడు👌. పారితోషికం విష‌యంలోనూ కాస్త పెద్ద మ‌న‌సు చూపిస్తే... చిన్న నిర్మాత‌ల్ని ప్రొత్స‌హించిన‌ట్టుంటుంది👋. మ‌రి బ్ర‌హ్మానందం ఈ దిశ‌గా ఎప్పుడు ఆలోచిస్తాడో చూడాలి😏.