రకుల్ కేకల గురించి ఏమన్నాడంటే..❗❗

  |   Tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాథ్స్ మాస్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని లండన్ లో చాలా భాగం షూట్ చేశారు🎥. ఇక్కడ కూడా రోడ్లపై చేసిన షూటింగ్ చేసినదే చాలా ఎక్కువ☝. హీరోయిన్ ఎన్టీఆర్ పడేసే సన్నివేశాల్లో భాగంగా.. రోడ్లపై రకుల్ కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్లే సన్నివేశం ఒకటి ఉంటుంది👆. ఈ సమయంలో రకుల్ దారి తప్పిపోవడంతో నానా హంగామా జరిగిందట💥. కారులోనే కంగారు పడిపోతూ... రకుల్ చేసిన హడావిడి మొత్తం పిక్చరైజ్ అయింది👌. 'డామిట్' అంటూ ఆమె అసహనం వ్యక్తపరచడం.. చాలా సేపటి తర్వాత మళ్లీ వాకీటాకీకి కనెక్షన్ రావడంతో.. మొత్తానికి కథ సుఖాంతం అయింది😎. అయితే.. రకుల్ తప్పిపోయిన సన్నివేశం గురించి తర్వాత అందరూ నవ్వుకున్నా.. ఆ టైంలో మాత్రం చాలా భయపడ్డారట😨. మొత్తానికి లండన్ రోడ్లపై రకుల్ పెట్టిన కేకలు మాత్రం.. అందరికీ బాగా గుర్తుండిపోయాయి.. అంటున్నాడు సుకుమార్☝.