కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు... రాహుల్ ద్రవిడ్ 👌

  |   క్రికెట్

అండర్-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే👎. అయితే టోర్నీ ఆద్యంతం ఆటగాళ్లు చూపించిన ప్రదర్శన తనకు సంతోషాన్ని కలిగించిందని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు😂. మున్ముందు ఈ టోర్నీ వారికి మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని చెప్పారు☝. భవిష్యత్‌లో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించి మంచి క్రికెటర్లుగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కుర్రాళ్లకు సూచించారు👍.