రంజీ ఫైనల్లో ముంబై✨🏆

  |   క్రికెట్

లక్ష్యం 571 పరుగులు...ఓ దశలో జట్టు స్కోరు 99/2... గెలవాలంటే ఇంకా 472 పరుగులు చేయాల్సిన దశలో నమన్ ఓజా (185 బంతుల్లో 113; 13 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ సింగ్ (189 బంతుల్లో 105; 11 ఫోర్లు, 1 సిక్స్)లు పోరాట స్ఫూర్తిని చూపెట్టారు👏. పటిష్టమైన ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చేజారిపోతున్న మ్యాచ్‌ను డ్రాతో గట్టెక్కించారు👍. ఫలితంగా మధ్యప్రదేశ్, ముంబైల మధ్య బుధవారం ముగిసిన రంజీ సెమీస్ మ్యాచ్ డ్రా అయ్యింది👐. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ముంబై ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది🌟.