ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ధీరుడిగా మెకల్లమ్....✨

  |   క్రికెట్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది✨. తన చిట్టచివరి టెస్ట్ మ్చాచ్ ఆడుతోన్న కివీస్ విధ్వంసకారుడు మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డులను తిరగరాశాడు👍.మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది👍. లంచ్ విరామంకంటే ముందే న్యూజిలాండ్ స్కోరు 32/3☝. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన మెకల్లమ్.. కంగారూలపై వీరప్రతాపం చూపాడు👏. ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే 21 పరుగులు పిండుకుని షాన్ మార్ష్ కు చుక్కలుచూపాడు👆. మెకల్లం 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అంపైర్ లంచ్ విరామం ప్రకటించాడు👍. ఆట మళ్లీ మొదలయిన తర్వాత బ్రెండన్ బాదుడే బాదుడు! సరిగ్గా 54 పరుగుల వద్ద 100 పరుగులు పూర్తిచేసుకున్న మెకల్లం.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ధీరుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు🌟.