సెలక్షన్ కమిటీలో చర్చనీయాంశంగా మారిన.....రహానే, పాండే❓❓

  |   క్రికెట్

భారత్ లో ప్రారంభమయ్యే వరల్డ్ టీ 20 జట్టు ఎంపికలో మాత్రం భారత సెలక్టర్లకు పరీక్ష ఎదురయ్యే అవకాశం కనబడుతోంది☝.ఆస్ట్రేలియాలో వన్డే, టీ20లో ఆడిన జట్టునే వరల్డ్ ట్వంటీ 20 కి దాదాపు ఎంపిక చేసే అవకాశం ఉన్నా అజింకా రహానే,మనీష్ పాండే ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య పోటీ ఏర్పడింది💫.టీమిండియా లో సరైన ఆటగాడు లేకపోవడంతోనే టీమిండియా కీలక సమయాల్లో ఓటమి పాలవుతుందనేది మహేంద్ర సింగ్ ధోని,సెలక్టర్ల అభిప్రాయం👍.శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు యువరాజ్ తో పాటు, రహానే, మనీష్ పాండేలు ఎంపికయ్యారు🙌.తొలి ఆరు స్థానాల్లో రోహిత్ శర్మ , శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని జట్టులో ఉండే అవకాశం ఉండటంతో ఏడో స్థానం కోసమే పోటీ నెలకొంది☝.వరల్డ్ టీ 20 లకు టీమిండియా జట్టును ఎంపికచేయడం లో రహానే, పాండేల పేర్లే చర్చనీయాంశంగా మారనున్నాయి👆.