ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 2-1🌟🌟

  |   క్రికెట్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాల్సిందిగా కివీస్ ను ఆహ్వానించగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసింది👍.ఈ మ్యాచ్ లో మెకల్లమ్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు తో47 పరుగులు తీయగా గప్టిల్ 61 బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్సర్లు తో 59 పరుగులు తో రాణించారు✨.ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 191 పరుగులకే ఓటమి పాలైంది👎.ఉస్మాన్ ఖాజా(41), జార్జ్ బెయిలీ(33), మిచెల్ మార్ష్(41) మినహా ఎవరూ ఆడకపోవడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు👎. చివరి వన్డేలో న్యూజిలాండ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది👍. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-1 తేడాతో చేజిక్కించుకుంది✨.