అదృష్టం ఉన్నా అఫ్ఫర్స్ చేజారిపోతున్నాయి.... కీర్తి సురేష్

  |   Tollywood

'నేను...శైలజ' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ భామ కీర్తి సురేష్ మొదటి చిత్రంతోనే మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రం విడుదలైన 15 రోజుల గ్యాప్ లోనే తమిళంలో మరో సూపర్ హిట్ కొట్టింది కీర్తి సురేష్. కాని ఇంత అదృష్టం ఉన్న ఈ భామకు ఏం లాభం లేకుండా పోయింది. తమిళంలో కీర్తి కి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. కాని తెలుగులో అయితే ఒక్క సినిమా కూడా ఆమె చేతికి రాలేదు.

ఆ మధ్య రామ్ చరణ్ తని ఒరువన్ తెలుగు రీమేక్ లో కీర్తి సురేష్ ని ముందు హీరోయిన్ గా అనుకున్నారు, కాని ఆ అవకాశం కాస్త రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి తలుపు కొట్టింది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందనున్న భారీ చిత్రంలో కూడా ఈ మలయాళ భామ పేరు వినిపించింది. కాని ఇది కూడా ఆమె చేయి జారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మన స్టార్స్ అందరు రెండు రెండు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇక ఈ మలయాళ భామకు తెలుగులో అవకశాలు రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అన్న మాట

📲 Get Tollywood on Whatsapp 💬