ఏకంగా 50 గంటల పాటు అల్లు అర్జున్ తో ప్రయాణం చేసిన భామ... 👌

  |   Tollywood

ఏకంగా 50 గంటల పాటు అల్లు అర్జున్ తో ప్రయాణం చేసి మధురానుభూతులను పొందిందట ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ . ఈమే ప్రస్తుతం అల్లు అర్జున్ తో నటిస్తున్న చిత్రం ''సరైనోడు ''. ఆ చిత్రంలోని ఒక పాట షూటింగ్ కోసం అమెరికాలోని బోవిలియా లోగల ఉయుని నగరానికి వెళ్ళింది.

హైదరాబాద్ నుండి ఉయుని సిటీ కి వెళ్ళాలంటే ఏకంగా 50 గంటల పై మాటే నట! యాభై గంటల పాటు అల్లు అర్జున్ తో పాటు చిత్ర బృందం తో పిచ్చా పాటీ గా మాట్లాడుతూ మధురానుభూతులను పంచుకుందట . ఈ ప్రయాణం బాగుందని , అలాగే ఉయుని సిటీ కూడా చాలా అందంగా ఉందని ....... ఇంత అందమైన ప్రదేశం చూడటానికి ఆమాత్రం కష్టపడటం పెద్ద కష్టం కాదని ట్వీట్ చేసింది.

📲 Get Tollywood on Whatsapp 💬