కాజల్ కు నటనలో తెలియనిది ఏదీ లేదంట! 👋

  |   Tollywood

ఇండస్ట్రీ లో ఎంతటి అనుభవజ్ఞులైనా నాకు తెలిసింది కొంతే మరియు తెలుసుకోవలసింది చాలా ఉంది అంటారు. కాని కాజల్ మాత్రం తనకు అన్నీ తెలుసు అంటోంది. సౌత్ ఇండస్ట్రీ లో దాదాపు అందరి హీరోలతో నటించిన కాజల్ నార్త్ లోను తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు కోలీవుడ్‌లోనే పరిస్థితి బెటర్‌గా ఉందని చెప్పవచ్చు. ద్విభాషా(తెలుగు,తమిళం)చిత్రం బ్రహ్మోత్సవంతోపాటు జీవాతో కవలైవేండామ్ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు.

ఇలా సౌత్ ఇండస్ట్రీ లో బిజీగా ఉన్న కాజల్ ఏమంటుందంటే ... నటీనటుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి డాన్స్‌లో ప్రావీణ్యం ఉంటే, మరొకరికి ప్రేమ సన్నివేశాల్లో చక్కగా నటించే నేర్పరితనం ఉంటుంది. ఇంకొందరికి శోక సన్నివేశాల్లో జీవించే ప్రతిభ ఉంటుంది. అయితే నాకు మాత్రం అన్నీ తెలుసు.

ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేయగలను. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో నాకూ ఏమీ తెలియదు. ముఖ్యంగా ఏడవడం అస్సలు తెలియదు. చిన్నతనం నుంచీ నేను ఏడ్చిన సందర్భాలు లేవు.అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడేదాన్ని. కన్నీరు వచ్చేవి కానీ అందులో జీవం ఉండేదికాదు. ఇప్పుడు ఏడవడంతో పాటు అన్నీ నేర్చుకున్నాను.

📲 Get Tollywood on Whatsapp 💬