తమిళ్ వెర్షన్ లో కూడా బహుబలికి అవార్డ్స్ ఇవ్వడం అన్నాయమట....రాధారవి 😅

  |   Tollywood

ఇటీవల ఐఫా ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రముఖ తమిళ నటుడు రాధారవి, బాహుబలి కి తమిళ కేటగిరి లో అవార్డులు ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు . అయితే ఆ వేడుకలలో తెలుగు కేటగిరి లోనే కాకుండా తమిళ కేటగిరి లో కూడా బాహుబలి కి అవార్డులు వచ్చాయి.

ఒక తెలుగు సినిమాకు తమిళ కేటగిరి లో అవార్డ్ ఇవ్వడం వల్ల మా లాంటి వాళ్ళకు అన్యాయం జరిగింది అనేది రాధారవి ఆరోపణ. రాధారవి ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పు లేదు కానీ ఇతని ఆవేదన ఏంటంటే ''పిశాచి '' అనే సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించాడు ఆ పాత్రకు తప్పకుండా అవార్డ్ వస్తుందని ఆశించాడు కానీ బాహుబలి లో చేసిన కట్టప్ప సత్యరాజ్ అవార్డ్ తన్నుకుపోయే సరికి కోపం పట్టలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, అదీ విషయం.

📲 Get Tollywood on Whatsapp 💬