అందులోనూ రికార్డులేనా పవన్?✨✨

  |   Tollywood

ఇప్పటిదాకా ట్రైలర్ వ్యూస్, లైక్స్ విషయంలో రికార్డులు చూశాం..❗ టీజర్ రికార్డులు చూశాం..❗ కానీ తొలిసారి మేకింగ్ వీడియోకు సంబంధించిన రికార్డులు కూడా తెరమీదికి వచ్చేశాయి👍. ఈ ఘనత పవన్ కళ్యాణ్ సినిమాకే దక్కింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు మేకింగ్ కు సంబంధించి ఓ మేకింగ్ వీడియో వదిలిన సంగతి తెలిసిందే☝.నిమిషం లోపు నిడివి ఉన్న ఆ వీడియో పవన్ అభిమానుల్ని ఉర్రూతలూగించింది✋. పవన్ స్టయిల్.. అతడి యాటిట్యూడ్.. ‘సర్దార్’ ఎసెన్స్.. అంతా కనిపించేలా ఈ వీడియో వచ్చాక భారీగా అంచనాలు పెరిగిపోయాయి💰.ఈ మేకింగ్ వీడియోకు కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్ లో 3 లక్షల వ్యూస్, 15 వేల లైక్స్ రావడం విశేషం😍. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా మేకింగ్ వీడియోకూ రాలేదట.పవన్ స్టయిల్, మేనరిజమ్స్ మళ్లీ మళ్లీ చూస్తూ ట్రైలర్ వచ్చే వరకు దీంతోనే కాలక్షేపం చేస్తున్నారు😍.