నాగార్జునను ఎందుకు పట్టించుకోవట్లేదు..?😳

  |   Tollywood

ఊపిరి తెలుగు వెర్షన్ వరకు నాగార్జున, కార్తిని సరిగ్గా బ్యాలెన్స్ చేసాడు దర్శకుడు వంశీ పైడిపల్లి👍. ఇక్కడ నాగ్ ఇమేజ్ ఎక్కువని తెలిసినా కూడా కార్తికి కూడా ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు👏. కానీ తమిళ్ కి వచ్చేసరికి అది కనిపించడం లేదు👎. అక్కడ కార్తి స్టార్ హీరో అయ్యుండొచ్చు గానీ నాగార్జునను తక్కువ చేస్తానంటే ఎలా..? ఇప్పుడదే జరుగుతోంది అక్కడ☝. ఊపిరి తమిళ ట్రైలర్ తోళాలో నాగ్ కు ప్రాముఖ్యత బాగా తగ్గించేశారు👎.ట్రైలర్ లో 75 శాతం కార్తినే కనిపించాడు☝. సినిమా అంతా కార్తి, నాగార్జున కలిసే ఉంటారు👬. కానీ తమిళ ట్రైలర్ లో మాత్రం నాగ్ ది ఏదో గెస్ట్ రోల్ అన్నట్లు చూపించారు దర్శకనిర్మాతలు👆. ఊపిరి ప్రమోషన్స్ లో నాగ్ కంటే కార్తికే పెద్దపీట వేస్తున్నారని అభిమానులు ఫీలవుతున్నారు😵. ఇదే ఇప్పుడు గ్రీకువీరుడి ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరుస్తోంది😫.