బాహుబలి2 కి ఫైనాన్స్ ప్రాబ్లెమ్స్❓

  |   Tollywood

బాహుబలి ది బిగినింగ్ కు మించి బాహుబలి ది కంక్లూజన్ ను రెడీ చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి👍. ఈ మూవీ అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యంగానే చిత్రీకరణ జరుపుకుంటోంది👍. ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ కావాల్సిన బాహుబలి2.. వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయింది☝. ఓ నాలుగు నెలలు పోస్ట్ పోన్ అంటే పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. ఇలా వాయిదా పడ్డానికి కారణమంటే విషయమే అసలు కీలకం ఇప్పుడీ సినిమాకి కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లెమ్స్ వచ్చినట్లు తెలుస్తోంది💵. ఫైనాన్స్ సమస్యలంటే.. సినిమా తీయడానికి కాదు. బాహుబలి👆 రెండో భాగంలో నటించేందుకు తమకు చెల్లించే పారితోషికాన్ని యాక్టర్లు భారీగా డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది💰. తొలిభాగం సాధించిన సక్సెస్ చూసిన తర్వాత.. ఇలా రెమ్యూనరేషన్ కోసం డిమాండ్లు పెరిగాయని అంటున్నారు☝.