చిరంజీవి అయినా తగ్గేదే లేదు😳

  |   Tollywood

చిరంజీవితో నటించే అవకాశమనగానే మిగిలిన ఆఫర్లన్నీ వదిలేసుకుని ఆ చిత్రాన్ని కైవసం చేసుకోవడానికి హీరోయిన్లు పోటీ పడే రోజులు పోయాయ్‌✋. నయనతారలాంటి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్లకి ఆ లిబర్టీ వుంది👍. ఈ చిత్రంలో నటించడానికి రెండు కోట్ల పారితోషికం అడిగిందట💰. హీరోయిన్‌ పాత్ర పెద్దంత వుండదు కనుక కోటి రూపాయలకే బేరం తెగ్గొట్టాలని ట్రై చేస్తే వేరే వాళ్లని చూసుకోమని వాళ్లతో సంప్రదింపులు కూడా మానేసిందట👎. దాంతో డైరెక్టర్‌ వినాయక్‌ రంగంలోకి దిగి ఆమెని బుజ్జగించాల్సి వచ్చిందట😰.మొత్తమ్మీద నయనతారకి రెండు కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారనేది తాజా వార్త👍.