భల్లాలదేవ ఇంటిలో ఓ ప్రత్యేకమైన అతిథి ....

  |   Tollywood

టాలీవుడ్ భల్లాలదేవ రానా ఇంటికి ఓ ఆదివారం అనుకోని అతిథి విచ్చేసింది. రావడంతోనే అందరినీ కంగారు పెట్టేసింది. ఫొటోలకు పోజిచ్చి ఆ అతిథి మెల్లగా జారుకోవడంతో అంతా చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ భల్లాలదేవ ఇంటిల్లిపాదిని కంగారుపెట్టిన ఆ అతిథి ఎవరనుకుంటున్నారు.. ఓ పాము. నిన్న మధ్యాహ్నం మా ఇంట్లో నేనెవరిని కలిశానో చూడండి అంటూ తమ ఇంట్లో చొరబడ్డ పాము ఫొటోను రానా సోమవారం ట్వీట్ చేశారు.

📲 Get Tollywood on Whatsapp 💬