రెజీనా నెక్స్ట్ సినిమా ......

  |   Tollywood

రెజీనా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది అయితే ఇది రెజీనా వ్యక్తి గతం వృత్తిపరంగా చెప్పాలంటే రెజీనా ప్రస్తుతం తమిళంలో కంటే తెలుగులోనే మంచి ఫామ్‌లో ఉన్నారు. తమిళంలో కొంచెం గ్యాప్ తరువాత మానగరం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్, శ్రీ హీరోలుగా నటిస్తున్నారు. నవ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చిన నలుగురు మిత్రుల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మానగరం అని వెల్లడించారు.ఈ సందర్భంగా వారికి ఎదురైన సంఘటనలు, సమస్యలు,వాటి నుంచి ఎలా బయట పడ్డారన్న సన్నివేశాల సమాహారమే చిత్రం అన్నారు.అయితే సందీప్ కిషన్, శ్రీలలో రెజీనా ఎవరిని ప్రేమిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు.