ఆ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో.. 👬🕺

  |   Tollywood

ఈ మధ్య టాలీవుడ్‌లో సహృద్ వాతావరణం కనిపిస్తుంది. టాప్ హీరోలు కలిసికట్టుగా ఈవెంట్స్‌కి హాజరు కావడం, ఒకరి సినిమాలని మరొకరు ప్రమోట్ చేయడం లేదంటే ఒక హీరో మూవీ వేడుకకి మరో హీరో గెస్ట్‌గా వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హీరోల సాన్నిహిత్యాన్ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా మూడు ఫ్యామిలీలకి చెందిన ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో కనిపించే సరికి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్‌కి తొలి రెండు సినిమాలు నిరాశ కలిగించడంతో తన తాజా చిత్రం మిస్టర్ మజ్నుపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఆయనకు మద్దతుగా ఎన్టీఆర్( నందమూరి ఫ్యామిలీ), రామ్ చరణ్ (మెగా ఫ్యామిలీ)లు నిలిచారు. మిస్టర్ మజ్నుని ఆదరించాలని,ఈ చిత్రం అఖిల్‌కి మంచి విజయం అందిస్తుందని ఈ హీరోలు భావిస్తున్నారు. రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/i_qf8AAA

📲 Get Tollywood on Whatsapp 💬