ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: చాందీ 👏

  |   Telugunews

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో పోటీ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ స్పష్టం చేశారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించామని తెలిపారు. ఎన్నికల కమిటీలపై అధిష్ఠానానికి ఈవారంలోనే నివేదిక పంపుతామని వెల్లడించారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈనెల 31న ఉదయం 10గంటలకు మరోసారి సమావేశమై చర్చిస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్ల చెప్పారు. 13 జిల్లాల్లో బస్సు యాత్రపై ఈనెల 31న భేటీలో మరోసారి చర్చిస్తామన్నారు. రాహుల్‌ గాంధీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు.. ఇది ఏఐసీసీ నిర్ణయమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీలో పొత్తులపై నిర్ణయం రాహుల్‌గాంధీకే అప్పగించామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సాధ్యమని రఘువీరారెడ్డి వివరించారు. ఫిబ్రవరి 1న బంద్‌కు సహకరించాలని ప్రత్యేక హోదా సాధన సమితి కోరిందని, బంద్‌ను విజయవంతం చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/kuTljgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬