చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోను 💁

  |   Tollywood

చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోనని అంటున్నారు అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. ఈ మధ్య కాజల్‌ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్‌ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని అన్నారు. ఒకవేళ వివాహం చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమకు చెందిన వారిని మాత్రం చేసుకోనని స్పష్టం చేశారు.

తనకు సినీ పరిశ్రమలో ఎందరో స్నేహితులు ఉన్నారని, కానీ వాళ్లలో ఎవ్వరినీ జీవిత భాగస్వామిగా ఊహించుకోలేదని తెలిపారు. ఒకవేళ ఇండస్ట్రీకి చెందినవారు వచ్చినా అతను తన పనిని గౌరవించి, అర్థంచేసుకునే వ్యక్తి అయితే అప్పుడు ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఒకప్పుడు కాజల్‌ ఓ సామాన్య వ్యక్తిని ప్రేమించారు. కానీ కాజల్‌ సినిమాలతో బిజీగా ఉండడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారు.

ఆ సమయంలో తానెంతగానో ఏడ్చానని ఒకానొక సందర్భంలో కాజల్‌ వెల్లడించారు.ప్రస్తుతం ఆమె 'భారతీయుడు 2' చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలైంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి-http://v.duta.us/3Nv7AwAA

📲 Get Tollywood on Whatsapp 💬