ప్రియాంక రాకతో పార్టీకి కొత్త బలం: మాజీ సీఎం 💁

  |   Telugunews

ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడాన్ని 1998 నుంచి 2013 వరకూ వరుసగా మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ స్వాగతించారు. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద పరిణామమని అన్నారు. పార్టీకి కొత్త శక్తి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

'కాంగ్రెస్ నేతలు, శ్రేణులతో సహా పార్టీ చాలా సంతోషంగా ఉంది. పరిస్థితుల్లో ఎంతో మార్పు వస్తుందనే బలమైన అంచనాలున్నాయి' అని షీలాదీక్షిత్ అన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించడం శుభ పరిణామమని, యూపీ ప్రజలకు ప్రియాంక అంటే ఎంతో ఇష్టమని, అందుకు అనుగుణంగా ప్రజల కోసం ప్రియంక ఎంతో చేస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. విపక్షాలకు ఇదో గొప్ప సవాలని కూడా ఆమె అన్నారు. ప్రియాంక తన ఆశయ సాధనలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/yqh7vgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬