ప్రవాస భారతీయులే భారత్‌ అంబాసిడర్లు 👴🙏

  |   Telugunews

ప్రవాసభారతీయులే భారత్‌ ప్రచారకర్తలని ప్రధానినరేంద్రమోడీ పేర్కొన్నారు. భారత్‌ శక్తిసామర్ధ్యాలకు వారే ప్రత్యక్ష నిదర్శనమని ప్రతిభా నైపుణ్యాలపరంగా భారతీయులదే ఎక్కువ శాతమని అభినందించారు. 15వ ప్రవాసి భారతీయ దివస్‌ సమ్మేళనాన్ని ప్రారంభించినమోడీ మన శక్తిసామర్ధ్యాలు వృత్తినైపుణ్యాలకు ఎన్‌ఆర్‌ఐలే బ్రాండ్‌ అంబాసిడర్లని కొనియాడారు. తన నియోజకవర్గం వారణాశిలో ప్రారంబించిన ఎన్‌ఆర్‌ఐ సమ్మేళన్‌నుద్దేశించి మాట్లాడుతూ భారతీయ సంతతికి చెందిన పలువురు ప్రముఖులు మారిషస్‌, పోర్చుగల్‌, ఐర్లాండ్‌ వంటి దేశాల్లోప్రముఖ స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు.

అంతేకాకుండా కాంగ్రెస్‌పార్టీపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. రాజీవ్‌గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రత ఇరూపాయలో 15 పైసలు మాత్రమే గ్రామీణ ప్రజలకు చేరుతున్నదన్న వ్యాఖ్యలను గుర్తుచేసారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈ లీకేజిని అరికట్టేందుకు ఎంతమాత్రం పనిచేయలేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రిమాట్లాడుతూ తన ప్రభుత్వం ఈ పరిస్థితిని కట్టడిచేసిందని, 85శాతం దోపిడీని అరికట్టగలిగామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఉన్న చెడును అంతటిని నిర్మూలించామని, టెక్నాలజీ సాయంతోనూరుశాతం ఫలితాలుసాధించామన్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/gxF4qQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬