బన్నీ ఛాన్స్ అలా మిస్ చేసుకుందట! 🤦‍♀️

  |   Tollywood

ప్రియా వారియర్ ఒరు ఆదార్ లవ్ చిత్రం ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో సందడి చేసిన ప్రియా వారియర్ మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన తెలుగు ఆఫర్స్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు నుండి ఎన్నో ఆఫర్లు వచ్చాయి అయితే వాటిలో ఎక్కువ శాతం చిన్న సినిమాలే ఉన్నాయి.

తెలుగు నుండి వచ్చిన అతి పెద్ద ఆఫర్ అంటే అల్లు అర్జున్ నుండి వచ్చిందే. నా వీడియోలు వైరల్ అయిన కొన్ని రోజులకే అల్లు అర్జున్ గారి సినిమాలో చేయాలంటూ పిలుపు వచ్చింది. అయితే నేను 'ఒరు ఆదార్ లవ్' చిత్రం షూటింగ్ లో ఉండటం వల్ల అల్లు అర్జున్ గారి సినిమాను చేయలేక పోయానంది. మరోసారి ఆ ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానంది.

ఒరు ఆదార్ లవ్ చిత్రం ఫలితం తర్వాత తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు దర్శకులు కథలు చెప్పారని వాటి గురించి ఆలోచిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. హిందీ ఇండస్ట్రీకి కూడా వెళ్లే ఆలోచనలో ఈ అమ్మడు ఉన్నట్లుగా అనిపిస్తుంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/KqSpIQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬